ఏప్రిల్ 23న సస్పెన్స్ థ్రిల్లర్ కథానిక చిత్రం !

Published on Apr 13, 2021 4:47 pm IST

మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లు గా రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణం తో జగదీష్ దుగన దర్శకత్వం లో శ్రీమతి పద్మ లెంక నిర్మిస్తున్న చిత్రం “కథానిక”. థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకం పై సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా కథ, మాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన జగదీష్ దుగన మాట్లాడుతూ “కథానిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మంచి గ్రిప్పింగ్ కథ కథనం తో ఊహకందని మలుపులతో మంచి నటి నటులతో నిర్మించాము.

సినిమా చాలా బాగా వచ్చింది. మనోజ్ నందన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ల నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుంది. మా చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాము. తప్పక చుడండి” అని తెలిపారు. నిర్మాత శ్రీమతి పద్మ లెంక మాట్లాడుతూ “కథానిక చిత్రానికి ఎంతో ప్యాషన్ తో నిర్మించాము. డైరెక్టర్ గారు చూపిన కథ బాగా నచ్చింది. ఎక్కడ కంప్రమైస్ కాకుండా నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. సంగీతం, కథ కథనం మా చిత్రం లో హైలైట్ గా నిలిచాయి. ఏప్రిల్ 23న రెండు తెలుగు రాష్ట్రలో విడుదల చేస్తున్నాము” అని తెలిపారు.

సంబంధిత సమాచారం :