శుశాంత్ లోకాన్ని వదిలి నెల, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమిచేసిందటే..?

Published on Jul 14, 2020 11:37 am IST

సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే రోజు బాలీవుడ్ లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న తన ఇంటిలో ఆత్మ హత్య చేసుకున్నారు. సుశాంత్ ఈ లోకాన్ని విడిచి నెలరోజులవుతున్నా…ఆయన్ని అభిమానులు మరియు చిత్ర పరిశ్రమ మరచిపోలేదు. ఇక సుశాంత్ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. కాగా సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండే మొదటిసారి సుశాంత్ మరణంపై స్పందించారు.

ఆమె సుశాంత్ ని గుర్తు చేసుకుంటూ తన ఇంటి ముందు ఓ దీపం ఉంచారు. ఆ దీపం వద్ద అంకిత సుశాంత్ పేరు పెట్టకున్నప్పటికీ, గాడ్ చైల్డ్ అని ప్రస్తావించింది. సుశాంత్ రాజ్ ఫుత్ అంకిత లోఖండేను ఎక్కువా ప్రేమించారట. అంకితతో బ్రేక్ అప్ కి సుశాంత్ అసలు ఇష్టపడలేదని సమాచారం. ఆమె ప్రేమించినంతగా తనను ఎవరూ ప్రేమించలేదని సుశాంత్ తన సైక్రియాటిస్టుకి చెప్పినట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :

More