తను పెళ్లి చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తలను ఖండించింది తెలుగమ్మాయి కలర్స్ స్వాతి. ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్లో స్వాతి పెళ్లి చేసుకుంటున్నట్టు ఒక కథనాన్ని ప్రసారం చేశారు. ఒక తమిళ హీరోతో గత కొంత కాలంగా స్వాతి ప్రేమలో ఉందని, వీరి పెళ్ళికి ఇద్దరి పేరెంట్స్ అంగీకరించారని ఆ కథనం సారాంశం. ఈ వార్తను సోషల్ మీడియాలో ఖండించింది స్వాతి. ఈ హీరోయిన్ పై ఇటువంటి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. మొన్న మే నెలలో ఇదే తరహా వార్తలు ప్రసారం కాగా స్వాతి ఖండిచింది.
‘నా పెళ్లి గురించి మరోసారి గాలి వార్తలను ప్రసారం చేస్తున్నారు. వీటిని నమ్మవద్దు. నా ఫ్రిడ్జ్, అందులో ఉన్న ఫుడ్ తో మాత్రమే నేను ప్రేమలో పడ్డాను’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.



