‘సైరా’ను తెలుగు జనం కంటే తమిళ జనమే ఎక్కువ చూశారు

Published on Jan 23, 2020 6:38 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం గతేడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న జెమినీ టీవీ ఛానెల టీవీ ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకులకు అందించింది. ఈ చిత్రానికి టిఆర్పీ రేటింగ్స్ 11.8 వరకు వచ్చాయి. అయితే సినిమాకు మొదటి నుండి రికార్డ్ స్థాయిలో రెటింగ్స్ వస్తాయనే అంచనాలు ఉండటంతో ఈ రేటింగ్స్ కొంత నిరుత్సాహపరిచాయి.

కానీ అనూహ్యంగా తమిళ వెర్షన్ తెలుగు కంటే ఎక్కువ టిఆర్పీ రేటింగ్ సాధించడం విశేషం. తమిళ వెర్షన్ రేటింగ్ చూస్తే 15.4 వరకు ఉంది. అంటే ‘సైరా’ టీవీ ప్రీమియర్లను తెలుగువారి కంటే తమిళ ప్రేక్షకులే ఎక్కువగా చూశారన్నమాట. అలాగే కన్నడ డబ్బింగ్ వెర్షన్ 6.3 టిఆర్పీని సాధించింది.

సంబంధిత సమాచారం :

X
More