సైరా లేటెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

Published on Oct 21, 2019 8:28 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. నైజాంలో మరియు వైజాగ్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి మిగతా ఏరియాల్లో అదే దిశగా సాగుతోంది. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల షేర్ మార్క్ ను దాటింది. ఇది చాలా బాగుంది. కానీ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా ఉండటంతో.. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకాస్త బెటర్ కలెక్షన్స్ వస్తేనే బయ్యర్లు సేఫ్ పొజిషన్ లోకి వెళ్తారు. కానీ కొత్త సినిమాలు విడుదలకావడంతో థియేటర్ల సంఖ్య తగ్గించారు. పైగా సెలవులు కూడా ఏమీ లేవు. కాబట్టి వసూళ్లు తగ్గుముఖం పడతాయనిట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక యూఎస్ లో ఈ చిత్రం 2.6 మిలియన్ల మార్క్ ను దాటింది. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు. అలాగే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటించారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం :

More