‘సైరా’ సెకండ్ షెడ్యూల్ వివరాలు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం గత డిసెంబర్లో మొదలై మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం చిరంజీవితో సహా టీమ్ మొత్తం సెలవుల్లో ఉన్నారు. అవి పూర్తికాగానే ఫిబ్రవరి మొదటి వారం నుండి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ ను తమిళనాడులోని పొల్లాచ్చిలో జరపనున్నారు.

ఇందులో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు టీమ్. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నయనతార కథానాయకిగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి స్టార్ నటీ నటులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఇంకా సంగీత దర్శకుడెవరనేది నిర్ణయింపబడలేదు.