తన పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ పన్ను!

తన పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ పన్ను!

Published on Apr 11, 2024 1:27 AM IST

తాప్సీ పన్ను ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌తో పెళ్లి చేసుకుంది. ఈ వివాహానికి సన్నిహితులు మరియు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మీడియాకు లేదా అభిమానులకు పెళ్లి గురించి ఎటువంటి సమాచారం లేదు. పెళ్లయిన వారం రోజుల తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. అవి వెంటనే అంతటా వైరల్‌గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ తన పెళ్లి గురించి ఎందుకు వెల్లడించలేదో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

తన పెళ్లి గురించి సంబందించిన విషయాలను వెల్లడించి, అందరిలో ఆసక్తి పెంచాలనే ఉద్దేశ్యం లేదు అని, దాని గురించి అందరూ చర్చించుకోవడం ఇష్టం లేదు అని తెలిపింది. అంతేకాక ఇది తన అభిప్రాయం అని, తన భర్తకి వేరే అభిప్రాయం ఉండొచ్చు అని తెలిపింది. పెళ్లి చేసుకున్న సంగతి ఎప్పటికీ రహస్యం గా ఉంచాలని లేదు, పెళ్లి జీవితం లో ఒకసారే జరుగుతుంది, దాన్ని ఆనందం గా చేసుకొవాలని నిర్ణయించుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు