టాక్..”సూర్య 42″ కి మాసివ్ బిజినెస్.?

Published on Mar 5, 2023 12:45 am IST


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కోసం తెలిసిందే, సూర్య కెరీర్ లో 42వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య కెరీర్ లోనే భారీ స్కేల్ లో అయితే తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాకి ఆల్రెడీ భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనితో బిజినెస్ పరంగా అయితే కోలీవుడ్ హిస్టరీ లోనే ఈ సినిమా సెన్సేషనల్ బిజినెస్ జరుపుతున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

కోలీవుడ్ వర్గాలు అయితే ఈ సినిమాకి ఇప్పుడు ఏకంగా 500 కోట్ల బిజినెస్ అవుతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎలాంటి ఫస్ట్ లుక్ కూడా లేకుండా ఈ సినిమా ఆఫర్స్ దక్కించుకుంది అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా గ్రీన్ స్టూడియోస్ మరియు యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :