తన డైట్ పై తమన్నా సంతృప్తి !

Published on Jul 19, 2021 8:00 am IST

మిల్కీ బ్యూటీ తమన్నా ఆహారం ఎప్పుడు తీసుకుంటే బెటరో కొన్నిసలహాలు ఇస్తోంది. ఆమె మాటల్లోనే ‘నేను నా కెరీర్ లో చాలా రకాల డైట్స్‌ ఫాలో అయ్యాను. అయినా ఆశించిన స్థాయిలో ఫలితం ఉండేది కాదు. కానీ డిన్నర్‌ కి, నెక్ట్స్‌ మార్నింగ్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ కి మధ్య పన్నెండు గంటల గ్యాప్‌ ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చిన ఫీలింగ్ నాలో కలిగింది.

12 గంటలు గ్యాప్ అంటే.. ఉదాహరణకు నేను ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు నా లాస్ట్‌ మీల్‌ చేస్తే… మర్నాడు ఉదయం 6 గంటలకు బ్రేక్‌ ఫాస్ట్‌ పూర్తి చేసేదాన్ని. ఇలా చేశాక నాలో చాలా మార్పు వచ్చింది. అన్నిటికి మించి మునుపటి కన్నా నా ఎనర్జీ లెవల్స్‌ బాగా పెరిగాయని కచ్చితంగా చెప్పగలను’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. కాగా ఓ ప్రముఖ చానెల్‌లో తమన్నా చేస్తున్న కుకింగ్‌ షో ‘మాస్టర్‌ చెఫ్‌’ త్వరలో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :