నా సినిమా తెలుగు ప్రేక్షకులకు చాలా త్వరగా కనెక్టవుతుంది – తమన్నా
Published on Oct 8, 2017 7:40 pm IST


మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ యొక్క తెలుగు రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ చేసిన ఈ సినిమాను తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ముందుగా తమిళ రీమేక్ కోసం తమన్నాను అనుకోగా అక్కడ రెమ్యునరేషన్ సమస్యతో ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. అలా పోయిందనుకున్న ఆఫర్ తెలుగు రూపంలో తనను వరించిందని తమన్నా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం అద్భుతమైన విషయమని అందుకు కారణం అందులోని కథేనని ఆమె అన్నారు.

ఫీమేల్ సెంట్రిక్ సినిమా అంటే మగవాళ్ళని తిట్టడం, ఫెమినిజం వంటి అంశాలు మాత్రమే కాదు ఇందులో మహిళను ఒక మంచి మానవతావాదిగా చూపించారు. అదే అందరికీ సినిమాకి కనెక్ట్ అయ్యేలా చేసింది. తెలుగు వాళ్లకు కూడా ఇది త్వరగా కనెక్టవుతుంది. కంగనా సినిమాలో చాలా గొప్పగా నటించారు. సినిమా మొదలయ్యేలోపు ఆమెను కలిసి పాత్ర గురించిన వివరాలు తెలుసుకుంటాను అన్నారు. అలాగే ప్రత్యేక గీతాల విషయంలో సెలక్టివ్ గానే ఉన్నానంటున్న ఆమె మంచి కథ దొరికితే వెబ్ సిరీసుల్లో సైతం నటిస్తానని అన్నారు.

 
Like us on Facebook