తాప్సి తెలుగు మూవీలో తమిళ హీరో ?

తాప్సి తెలుగు మూవీలో తమిళ హీరో ?

Published on Jan 2, 2021 10:01 PM IST

tapsee
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మంది నాదం’ మూవీతో టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి… ప్రస్తుతం బాలీవుడ్‌లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది తాప్సీ. ప్రస్తుతం నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటిస్తోంది.ముఖ్యంగా లేడీ ఓరియేంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింది. ఈ అమ్మడు బాలీవుడ్ లోకి వెళ్లిన తరువాత తెలుగు సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గించేంసింది. తాప్సి ఇప్పుడు ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. చాలాకాలం త‌ర్వాత తాప్సీ తెలుగు సినిమా చేయ‌నున్నారు.

డైరెక్ట‌ర్ తేజ రూపోందిస్తున్న ‘అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ’ సినిమాలో తాప్సీకి ఛాన్స్ ద‌క్కిందని సమాచారం. ఈ సినిమాలో హీరోగా గోపిచంద్ న‌టిస్తాడ‌ని ముందుగా ప్ర‌చారం జ‌రిగినా… కొన్ని కారణాలతో గోపిచంద్ ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌టంతో ఒక త‌మిళ్ యంగ్ హీరోను కథానాయకుడిగా అనుకుంటున్నారట. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను అనుకున్న‌ప్ప‌టికీ చివరికి దర్శకుడు తేజ తాప్సీని ఫైనల్ చేశారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కబోతున్నఈ సినిమాను వీలైనంత తొందరగా కంప్లీట్ చెయ్యాలని తేజ ఆలోచనలో ఉన్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు