తమిళ సూపర్ స్టార్ అజిత్ శ్వాస సంబధిత సమస్యకు చిన్న సర్జరీ చేయించుకున్నారు. ఈ ఉదయం జరిగిన ఎండోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా ముగిసింది. ఇదే విషయాన్ని అజిత్ సన్నిహితులు, తమిళ మీడియా ధృవీకరించాయి. గత కొద్దికాలంగా శ్వాస సంబంధ ఇబ్బందులకు గురవుతూ ఉన్న అజిత్ ఇక ఈరోజు సర్జరీ చేయించుకున్నారు.
అజిత్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎన్నై అరిందాళ్’ తాజాగా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను తెలుగులో ‘ఎంతవాడు గానీ..’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈమధ్యనే తండ్రి అయిన అజిత్.. కొన్నాళ్ళు ఆ సంబరాల్లో మునిగి తిరిగి కొత్త సినిమా పనుల్లో నిమగ్నం కానున్నారు.


