పవన్ విజ్ఞప్తికి స్పందించిన తమిళనాడు సిఎం

Published on Mar 30, 2020 8:00 pm IST

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఒక విజ్ఞప్తిని పంపిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నుండి కొందరు మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడుకు వెళ్లారు. ఇంతలోనే దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో మత్స్యకారులు చెన్నై హార్బర్ వద్దే చిక్కుకుపోయారు. కనీసం తిండి వసతి కూడా లేక ఇబ్బందులు పడుతున్న వారి గురించి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో పవన్ వెంటనే ఆ మత్స్యకారులను ఆదుకోవాలని, లాక్ డౌన్ ముగిసేవరకు వారికి సహాయం అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని ట్విట్టర్ ద్వారా కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సిఎం పళనిస్వామి మత్స్యకారులకు వెంటనే సహాయం అందించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించామని, వారి బాధ్యతను తాము చూసుకుంటామని తెలుపుతూ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More