తాప్సి ‘రష్మీ రాకెట్’ లుక్ చూశారా?

Published on Aug 30, 2019 2:52 pm IST

హీరోయిన్ తాప్సి కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో నటిస్తూ బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల ఆమె నటించిన గేమ్ ఓవర్ చిత్రం తెలుగు తమిళ భాషలలో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఆమె హిందీలో ఓ బయో పిక్ కి నటిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఆ చిత్రానికి సంబంధించిన ఆమె లుక్ తో పాటు చిత్ర వివరాలు పంచుకున్నారు.

రష్మీ రాకెట్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతానికి చెందిన రష్మీ అనే అథ్లెటిక్ అమ్మాయి జీవితం ఆధారంగా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం ఆకర్ష్ ఖురానా వహిస్తుండగా, రోనీ స్క్రీవాలా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :