తారక్ – ప్రశాంత్ నీల్ ల ఫిల్మ్ భీభత్సమేనట.!

Published on Sep 19, 2020 12:48 pm IST

“RRR” చిత్రంతో యంగ్ టైగర్ పాన్ ఇండియన్ సినీ ప్రస్థానం కూడా మొదలయ్యింది. ఈ సినిమా తర్వాత తారక్ చేయనున్న రెండు ప్రాజెక్టులపై కూడా తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా విషయంలో యంగ్ టైగర్ అభిమానులు ఊహించని రీతిలో అంచనాలు పెట్టుకున్నారు.

అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ ను నీల్ తారక్ కోసం సిద్ధం చేసాడని సినీ వర్గాల్లో టాక్ కూడా వచ్చింది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు ఇపుడు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ ఒక పవర్ ఫుల్ మాఫియా డాన్ గా చూపించనున్నారట.

అలాగే ఈ రోల్ కూడా తాను ఇపుడు తీస్తున్న మోస్ట్ పవర్ ఫుల్ చిత్రం “కేజీయఫ్” లోని రాకీ భాయ్ రోల్ నే తలదన్నేలా ఉండేట్టు డిజైన్ చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తారక్ కు మాస్ లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. మరి అలాంటప్పుడు మాస్ పల్స్ బాగా తెలిసిన ఈ దర్శకుడు కనుక సరిగ్గా క్యారక్టర్ డిజైన్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల భీబత్సం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More