‘ఎన్టీఆర్’ను కొత్తగా చూపించబోతున్న రాజమౌళి !

Published on Oct 28, 2018 3:49 pm IST

ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో, రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో, రాజమౌళి దర్శకుడు కావడంతో ఈ సినిమా గురించి తెలుగు సినీపరిశ్రమే కాకుండా, ఇతర సినీపరిశ్రమలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాజమౌళి, ఎన్టీఆర్ ని సరికొత్త లుక్ లో చూపించబోతున్నాడట. అందులో భాగంగానే ఇటీవలే రాజమౌళి, ట్రైనర్ స్టీవ్స్‌ లాయిడ్‌ తో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్‌ కూడా తన లుక్ కోసం నాలుగైదు నెలల పాటు కఠినమైన బాడీ ట్రైనింగ్‌ తీసుకోనున్నారు. ఈ ట్రైనింగ్ మొత్తం స్టీవ్స్‌ లాయిడ్‌ ఆధ్వర్యంలో ఆయన చెప్పిన సూచనల ప్రకారమే జరగనుంది. మొత్తం మీద ఎన్టీఆర్‌ ఈ సినిమాలో పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రం కోసం ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ని రాస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :