ఇంకొన్ని గంటల్లో బుల్లి తెరపై ఎన్టీఆర్ సందడి !
Published on Jul 16, 2017 5:36 pm IST


జూ. ఎన్టీఆర్ అభిమానులు, బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సందర్భం ఇంకొన్ని గంటల్లో ఆసన్నంకానుంది. తారక్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఈరోజు రాత్రి 9 గంటల నుండి ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఎన్టీఆర్ లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వనున్నాడు.

దీంతో అభిమానులంతా ఎప్పుడెప్పుడు 9 గంటలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ షోతో స్టార్ మా యొక్క టిఆర్ఫీ రేటింగ్స్ పెరగడమేకాక కుటుంబ ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ కు మరింత ఆదరణ దక్కునుంది. ఈ షోలో పాల్గొననున్న 12 మంది కంటెస్టెంట్లు వీరే అంటూ ఒక జాబితా ఉదయమే బయటకు లీకవగా అసలెవరెవరు పాల్గొంటారో సాయంత్రమే తెలియనుంది. ఇకపోతే తారక్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై లవ కుశ’ చిత్రంలోనటిస్తున్నారు.

 
Like us on Facebook