రజినీ బర్త్ డే కు పెటా టీజర్ !

Published on Dec 11, 2018 5:03 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెటా’ టీజర్ డిసెంబర్ 12న ఉదయం 11గంటలకు విడుదలకానుంది. రేపు రజినీ బర్త్ డే కావడం విశేషం. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ సింహ , నవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష , మెగా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ఆడియో కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది. అయితే ఈ చిత్రం తెలుగులో మాత్రం అదే సమయానికి విడుదలవుతుందో లేదో చూడాలి. ఇక రజినీ ఈ చిత్రం తరువాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నాడని సమాచారం.

సంబంధిత సమాచారం :