చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సాయిధరం తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఆన్ లైన్ లోకి వచ్చేసింది. ఈ సారి మన మెగా హీరో తేజ్ చాలా క్యాజువల్, అండ్ కూల్ గా అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే తేజ్ మొదటిసారిగా ఒక లవర్ బాయ్ గా తెరపైన కనిపించబోతున్నాడు. అది కూడా ప్యూర్ లవ్ ఎంటర్ టైనర్ కి పెట్టింది పేరైన దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఇంకా ఈ సినిమాలో లవ్ ఫీల్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంటేనే ఒళ్ళు పులకిస్తుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే అభిమానుల్లో పోస్టర్ కి మంచి ఆదరణ లభించింది.
చాలా రోజుల నుంచి వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న సాయి ధరంతేజ్ కి కరుణాకరం కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఈ సారి హిట్టునేచ్చేలానే ఉంది. అంతే కాకుండా నేటిజన్స్ నుండి కూడా ఈ సినిమాకు సంబంధించి చాలా పాజిటీవ్ రేస్పాన్సే వస్తుందనటంలో కొంచం గొప్ప విషయమనే చెప్పుకోవాలి.


