ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ వచ్చేస్తోంది !
Published on Nov 20, 2017 12:18 pm IST

బాల‌కృష్ణ , తేజ‌ల కాంబినేష‌న్‌లో వస్తోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ జనవరి 18 న ప్రారంభం కానుంది. అదేరోజు ఈ సినిమాకు సంభందించి ఒక టీజర్ విడుదల చెయ్యనున్నారు చిత్ర యూనిట్. టీజర్ షూట్ ఈ వారంలో చెయ్యబోతున్నారు. బాలయ్య ఈ షూట్ లో పాల్గోబోతున్నారని సమాచారం.

ఎన్టీఆర్ ఆత్మ‌క‌థ‌, అందులోనూ ఆ పాత్ర‌లో బాల‌య్య నటించబోతుండడంతో సినీ, రాజకీయ వర్గాలో ఈ మూవీ పై ఆసక్తి నెలకొంది. కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబందించి నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది.

 
Like us on Facebook