ఇంటర్వ్యూ : తేజ సజ్జా – ఈ కథ నాకు రావడం నా అదృష్టం !

Published on Jul 24, 2021 4:38 pm IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన నటుడు తేజ సజ్జ హీరోగా ‘జాంబి రెడ్డి’తో సోలో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా తేజ సజ్జ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘ఇష్క్’. ఈ సందర్భంగా తేజ సజ్జా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

కరోనా సెకెండ్ వేవ్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా మీదే కదా ?

అవును అండి, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత జులై 30న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా మా ‘ఇష్క్’నే.

ఈ సినిమా కథ కథనాల గురించి ?

రెగ్యులర్ సినిమా కథలకు దూరంగా కొత్త కాన్సెప్ట్ తో కొత్త కంటెంట్ తో వస్తోన్న సినిమా అండి ఇది. మొదటి సీన్ నుండి లాస్ట్ సీన్ వరకూ సినిమాలో తరువాత ఏమి జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది సినిమా. ఇలాంటి కథ నాకు రావడం నా అదృష్టం.

కొత్తగా అంటే.. ఏమిటి ఆ కొత్తదనం ?

న్యూ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ న్యూ స్టైల్ ఆఫ్ స్టోరీ టేలింగ్ ఉన్న సినిమా ఇది, కచ్చితంగా అందర్నీ థ్రిల్ చేస్తోంది ఈ సినిమా. తెలుగు సినిమాకి ఇది కొత్తరకం కంటెంట్ ఇది.

ఇది మలయాళ రీమేక్ కదా, మరి తెలుగు వెర్షన్ లో ఏమి మార్పులు చేశారు ?

కొన్ని మార్పులు చేశాము. కానీ ఎక్కడా కథను టచ్ చేయలేదు. మలయాళ వెర్షన్ ను ఇంకా టైట్ చేసి.. తెలుగు వెర్షన్ ను తీసుకువస్తున్నాము. ప్రతి సీన్ బాగుండేలా ప్లాన్ చేశాము.

ఈ సినిమా నేపథ్య సంగీతం బాగా వచ్చింది అంటున్నారు ?

ఇలాంటి సినిమాకి మ్యూజిక్ చాల ముఖ్యం అండి. ఈ సినిమా నేపథ్య సంగీతం అద్భుతంగా వచ్చింది. మణిశర్మ గారి కొడుకు మహితి సాగర్ గారు చాల బాగా చేశారు. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం.

సినిమాలో మీ క్యారెక్టర్ గురించి ?

హీరో క్యారెక్టర్ మీద, అతని సీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే సినిమా ఇది. అంటే నా నటన నటన మీద నడిచే సినిమా ఇది. నాకు ఓ బేబీ, జాంబీరెడ్డి సినిమాల్లో మంచి పేరు వచ్చింది. కానీ ఈ సినిమాతో నా గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు అనుకుంటున్నాను.

మీకు ఈ సినిమాలో రొమాంటిక్ అంశాల గురించి ?

ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ అండి. అయితే ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా కూర్చుని చూడొచ్చు. ఎక్కడా సినిమాలో పరిధి దాటలేదు.

ఈ సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు ?

ఈ సినిమా గురించి నాకు ఎలాంటి భయం లేదు. ఈ సినిమా గుడ్ కంటెంట్ తో తీశాము. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, సినిమాకి నాకు మంచి పేరు వస్తోందని నేను ఎంతో నమ్మకంతో ఉన్నాను. ముఖ్యంగా మా నిర్మాతగారి మీద నమ్మకం వల్ల నేను చాలా దైర్యంగా ఉన్నాను.

మీ ఫ్రెండ్ ప్రశాంత్ వర్మతో మీ చేసే సినిమాల గురించి మాట్లాడతారా ?

మామూలుగానే మాట్లాడతాను. ఎలాంటి సినిమా చేయబోతున్నాను అనే విషయాలు క్యాజువల్ గా డిస్కస్ చేస్తాను తప్పితే.. ఏ సినిమా చేయాలి అని డిస్కస్ చేయను.

ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు?

నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడడానికి చాలా ఆసక్తిగా ఉన్నారని అనుకుంటున్నాను.

మీ భవిష్యత్ ప్రాజెక్టులు?

నేను ఇప్పటికి ఏ సినిమా ఒప్పుకోలేదు. హనుమాన్ తర్వాత కెరీర్ స్థాయి మారుతుందనే ఆశతో ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదు. చూడాలి మరి ఏమవుతుందో.

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :