కొత్త హీరోయిన్ కి ఫిదా అయిపోయిన తెలుగు ప్రేక్షకులు !
Published on Nov 19, 2016 12:49 pm IST

nandita-swetha
ఈ సంవత్సరం పర భాషా హీరోయిన్లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నారు. కొంత కాలం క్రితమే నాని ‘జెంటిల్మెన్’ చిత్రంతో నివేదా థామస్ మంచి నటి అనే పేరు తెచ్చుకుంది. అలాగే ‘నేను శైలజా’ చిత్రంతో ‘కీర్తి సురేష్’ ఫెమస్ అయిపోయి ఇప్పుడు పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక కొద్ది రోజుల క్రితమే మలయాళం నటి మంజిమ మోహన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంటే తాజాగా నిన్న విడుదలైన నిఖిల్ చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తో పరిచయమైన కన్నడ నటి ‘నందితా శ్వేత’ ఒక్క రోజులోనే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.

సినిమాలో ఆమె నటన, హావ భావాలు, బాడీ లాంగ్వేజ్, అందం అన్నీ మన తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆమె నటనకు సోషల్ మీడియా ప్రేక్షకులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ట్విట్టర్లో చాలా మంది ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టేశారు. సినిమా మంచి టాక్ తెచ్చుకోవడానికి, ముందు ముందు సాదించబోయే విజయానికి ఆమె కూడా ఒక ప్రధాన కారణమని చెప్పొచ్చు. దీంతో ఆమె స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ముందు ఆమెకు తెలుగులో పెద్ద పెద్ద ఆఫర్లు దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 
Like us on Facebook