మొత్తానికి ‘అదిరింది’ లోని డైలాగ్స్ ను కట్ చేసిన సెన్సార్ బోర్డ్ !
Published on Nov 9, 2017 5:00 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రం తమిళనాట దిగ్విజయంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి వసూళ్లు, ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పలు వివాదలకు కూడా నెలవైంది. ఈ చిత్రంలో హీరో విజయ్ జిఎస్టీని విమర్శిస్తూ చెప్పిన డైలాగ్స్ తమిళనాట పెద్ద దుమారం రేపాయి. అధికార బీజేపీ నాయకులు జిఎస్టీని అవమానించారని, వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.

దీంతో ఈరోజు విడుదలకాబోతున్న తెలుగు వెర్షన్లో జిఎస్టీకి సంబందించిన ఆ డైలాగ్స్ పై సెన్సార్ బోర్డ్ ఎక్కువ దృష్టి పెట్టి ఎలాంటి వివాదాలకు తావివ్వకూడనే ఉద్దేశ్యంతో వాటికి మ్యూట్ చేసేసింది. దీంతో అసలు సినిమాలో జిఎస్టీని ఏ కోణం నుండి విమర్శించారు, ఆ విమర్శ సరైనదా కాదా అని తెలుసుకునే అవకాశం తెలుగు ఆడియన్సుకు లేకుండా పోయింది. ఇకపోతే ఈ చిత్రానికి మార్నింగ్ షో నుండి పాజిటివ్ టాక్ వస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook