తెలుగు ‘క్వీన్’ లో అతనే హీరో !


హిందీలో కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘క్వీన్’. ఈ సినిమా ఇదే టైటిల్‌తో ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్నది. కాగా ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నది. ఈ క్రమంలోనే ‘క్వీన్’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటివలే విడుదల చేసారు చిత్ర యూనిట్, ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ లో హీరోగా నటించబోయే ఆర్టిస్ట్ ను ప్రకటించారు,’గుంటూర్ టాకీస్’ చిత్రంలో నటించిన సిద్దు ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇదే సినిమా తమిళం, మలయాళంలోనూ రీమేక్ అవుతున్నది. అయితే తమిళ వెర్షన్‌లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నది. ఈ సినిమాకు ‘ప్యారిస్ ప్యారిస్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు, అలాగే మలయాళ వెర్షన్ ‘క్వీన్‌’ లో మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నది.