మార్చి 16 నుండి థియేటర్లు బంద్ !
Published on Mar 13, 2018 5:14 pm IST

డిజిటల్ ప్రొవైడర్ల వివాదం తెలుగు పరిశ్రమలో ఒక కొలిక్కి వచ్చినా తమిళనాట మాత్రం ఇంకా సద్దుమణగలేదు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో డిజిటల్ ప్రొవైడర్ క్యూబ్ ప్రతిపాదించిన కొత్త ధరల పట్ల నిర్మాతల మండలి సంతృప్తి చెందలేదు. దీంతో మార్చి 16 నుండి పూర్తిస్థాయిలో థియేటర్ల బంద్ ఉండనుంది.

అంతేగాక తమిళనాట జరిగే షూటింగులు కూడా 16 నుండి ఆగిపోవాలని, బయటి ప్రాంతాల్లో జరిగే చిత్రీకరణలు మార్చి 23 నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మార్చి 16 నుండి ఆగిపోవాలని, 16 నుండి ఎలాంటి ఆడియో విడుదలలు ఉండవని, కనీసం సినిమాలకు సంబందించిన ప్రకటనలు కూడ పేపర్లలో రాకూడదని మండలి నిబంధనలు విధించింది.

 
Like us on Facebook