బ్రహ్మాండమైన ట్రీట్ ప్రామిస్ చేస్తున్న “ముఫాసా” లేటెస్ట్ ట్రైలర్

బ్రహ్మాండమైన ట్రీట్ ప్రామిస్ చేస్తున్న “ముఫాసా” లేటెస్ట్ ట్రైలర్

Published on Apr 30, 2024 8:00 AM IST

హాలీవుడ్ సినిమా నుంచి ఉన్న పలు సూపర్ హిట్ స్టోరీస్ లో “ది లయన్ కింగ్” కూడా ఒకటి. మరి ఇది యానిమేషన్ లో వచ్చినా లైవ్ యాక్షన్ మోషన్ పిక్చర్ గా వచ్చినా కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే గత కొన్నేళ్ల కితం వచ్చిన లైవ్ యాక్షన్ ఫోటో రియలిస్టిక్ చిత్రం “ది లయన్ కింగ్” చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ అయ్యింది.

మెయిన్ గా మన తెలుగులో కూడా అనేకమంది ప్రముఖుల డబ్బింగ్ లో వచ్చి అందరి దృష్టి ఆకర్షించి తెలుగులో కూడా హిట్ అయ్యింది. సింబా పాత్రకి నాని, విలన్ స్కార్ పాత్రకి జగపతిబాబు, అలాగే టిమోన్, పుంబా లాంటి కామెడీ పాత్రలకి బ్రహ్మానందం, ఆలీ లతో డబ్బింగ్ చేసి అదరగొట్టారు. అయితే మళ్ళీ ఇన్నాళ్లకు అవైటెడ్ సీక్వెల్ “ముఫాసా” రెండో భాగంగా రాబోతుంది.

మరి మేకర్స్ అవైటెడ్ టీజర్ ట్రైలర్ కట్ ని ఇటీవల విడుదల చేయగా ఇది మాత్రం ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించింది అని చెప్పాలి. పార్ట్ 1 కంటే బెటర్ గా ఒక ఊహించని విజువల్ ట్రీట్ ని అయితే ప్రామిస్ చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. సింబా పై సన్నివేశాలు మెయిన్ గా ఆయా మ్యూజిక్ తో చూసేందుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తున్నాయి.

వీటితో మాత్రం ఈ సినిమా పార్ట్ 1 కంటే పెద్ద హిట్ అయ్యేలా అనిపిస్తుంది. మరి చూడాలి తెలుగు డబ్బింగ్ మరోసారి అదే కాస్ట్ తో ఉంటే బాగా ప్లస్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు బ్యారీ జెన్కిన్స్ పని చేయగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు