‘తలైవి’లో ప్రకాష్ రాజ్ నటించట్లేదా ?

Published on Oct 21, 2019 9:07 am IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత సినీ, రాజకీయ, వ్యక్తిగత జీవితంలో నటుడు, మాజీ సీఎం ఎంజిఆర్ పాత్ర ఎంతో ప్రాముఖ్యం కలిగినది. అందుకే ఆ పాత్రలో స్టార్ నటుడు అరవిందస్వామిని తీసుకున్నారు. అలాగే మరో కీలక పాత్ర అయిన కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పాత్రలో వేరే నటుడ్ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రకాష్ రాజ్ తమిళంతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే కాబట్టి ఆయన చేరిక సినిమాకు బాగా ప్లస్ కానుంది. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫీ చేయనుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘తలైవి’గా వస్తున్న ఈ చిత్రం హిందీలో ‘జయ’ పేరుతో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More