తలైవర్ “కూలీ” రిలీజ్ ఈ ఫార్మాట్ లో కూడా!?

తలైవర్ “కూలీ” రిలీజ్ ఈ ఫార్మాట్ లో కూడా!?

Published on Apr 24, 2024 10:04 AM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా “కూలీ” కోసం తెలిసిందే. మరి రజినీకాంత్ కెరీర్ లో 171వ సినిమా ఇది కాగా ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ తో తలైవర్ ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. అయితే ఈ సినిమా విషయంలో లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

దీని ప్రకారం లోకేష్ కనగరాజ్ గత చిత్రం లియో తరహాలో ఈ సినిమా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్ లోనే చిత్రీకరణ చేస్తుండగా ఇదే ఫార్మాట్ లో రిలీజ్ చేయనున్నారట. దీనితో సౌత్ నుంచి మరో సినిమా ఐమ్యాక్స్ రిలీజ్ కి రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లోకేష్ ఈ చిత్రం స్క్రిప్ట్ కోసం సుమారు 6 నెలలు వెచ్చించాడు. అలాగే మరో 6 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసే ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు