రవితేజ కోసం మాస్ బీట్స్ ఇవ్వనున్న తమన్ !

రవితేజ కోసం మాస్ బీట్స్ ఇవ్వనున్న తమన్ !

Published on Feb 15, 2018 8:45 PM IST

రవితేజ ‘నీకోసం’ సినిమా ద్వారా శ్రీనువైట్ల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా తరవాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వెంకీ’, ‘దుబాయి శీను’ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. తాజాగా వీరిద్దరు కలిసి సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అమర్ అక్భర్ అంటోని పేరుతో తెరకేక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ లో రవితేజ ఏప్రిల్ నుండి పాల్గొనబోతున్నాడు.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ కిక్ సినిమాతో తమన్ కు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తరువాత రవితేజ చేసిన చాలా సినిమాలకు తమన్ సంగీతం అందించడం విశేషం. మళ్ళి వీరిద్దరు చేస్తున్న సినిమా కోసం తమన్ మాస్ సాంగ్స్ ఇవ్వబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం రవితేజ నేలటికెట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు