‘భీమ్లా’ పై ఎక్కడ లేని హైప్ తీసుకొచ్చిన థమన్.!

Published on Aug 18, 2021 10:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్”. రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సాలిడ్ మాస్ చిత్రం పై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందు నుంచి కూడా మంచి హైప్ లో ఉన్న ఈ చిత్రం నుంచి మొన్ననే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తో అయితే మరో స్థాయికి వెళ్ళింది.

ఈ వీడియో వచ్చిన నాటి నుంచి కూడా మూవీ లవర్స్ లో ఇదే గ్లింప్స్ ట్రెండ్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన స్పెషల్ బ్యాక్గ్రౌండ్ కి అంతే స్పెషల్ రెస్పాన్స్ రావడం గమనార్హం. ఒరిజనల్ వెర్షన్ నే కాస్త మార్చి ఇంకా ట్రెండీ గా ఇవ్వడంతో భీమ్లా నాయక్ యుఫొరియా ఇంకో లెవెల్ కి వెళ్లిందని చెప్పాలి.

ఇంతకు ముందు వరకు కూడా పవన్ ముందు రీమేక్ సినిమాల్లానే సోసోగానే అంతా అనుకున్నారు కానీ థమన్ మాత్రం తన అవుట్ స్టాడింగ్ వర్క్ తో ఈ చిత్రానికి ఇంకో స్టాండర్డ్స్ ని సెట్ చేసి పెట్టాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వరకు వకీల్ సాబ్ కే పవన్ కి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో చూసాం. అలాంటిది మాస్ సినిమాకి ఏ రేంజ్ లో ఇస్తానో ఊహించుకోమన్నాడు. ఇప్పుడు అదే నిజం చేసాడని చెప్పాలి. మరి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :