పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ !
Published on Nov 8, 2016 8:43 am IST

thaman
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం వరుస సినిమాలకు సైన్ చేశారు. కొద్దీ రోజుల క్రితం త్రివిక్రమ్ సినిమాకు ప్రారంభిత్సవ పూజ చేసిన పవన్ అంతకు ముందే తమిళ దర్శకుడు, అజిత్ తో ‘జిల్లా’ ఫేమ్ ఆర్టీ నీసన్ తో ఓ సినిమాకి ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించే భాద్యత ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ కు దక్కింది.

ఈ విషయాన్నే తెలుపుతూ థమన్ ‘పవన్ కళ్యాణ్, ఆర్టీ నీసన్ కాంబినేషన్లో రానున్న సినిమాకి సంగీతం అందించే ఛాన్స్ దక్కింది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ మధ్య థమన్ సంగీతం అందించిన ‘సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, తిక్క’వంటి మెగా హీరోల చిత్రాలకు సంగీతం అందించాడు థమన్. ఇకపోతే థమన్ మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రానికి సంగీతం అందించనున్నాడని వార్తలు గత కొద్దిరోజులుగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook