మెగా హీరో సినిమాకు థమన్ సంగీతం !
Published on Nov 24, 2017 11:54 am IST

రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగస్థలం 1985’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నాడు. ఈ సినిమా ఈరోజు ఉదయం ప్రారంబమయ్యింది.

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీత దర్శకుడు. గతంలో థమన్ & బోయపాటి కాంబినేషన్ లో ‘సరైనోడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఈ సినిమా టైటిల్ మరియు హీరోయిన్ పేరు అనౌన్స్ చెయ్యనున్నారు చిత్ర యూనిట్.

 
Like us on Facebook