ఆగస్ట్‌ 20న ఆహాలోకి మరో వెబ్‌ సిరీస్‌..!

Published on Aug 17, 2021 1:36 am IST

కరోనా పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో ప్రేక్షకులు ఓటీటీల వైపు మళ్లారు. దీంతో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో పలు ఓటీటీలు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. అయితే మంచి సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ‘ఆహా’ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తాజాగా ఇప్పుడు మరో కొత్త వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది.

‘పెళ్లిగోల’ వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్న మల్లిక్‌ దర్శకత్వం వహించిన ‘తరగతి గది దాటి’ ఆగస్ట్‌ 20న ఆహాలో విడుదల కాబోతుంది. ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. హర్షిత్‌ రెడ్డి, పాయల్‌ రాధాకృష్ణ, నిఖిల్‌ దేవాదుల ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ను మొత్తం 5 ఎపిసోడ్లుగా విడుదల చేయనున్నారు. ఇద్దరు టీనేజర్ల మధ్య ఏర్పడ్డ క్యూట్ లవ్ స్టోరీనీ వినూత్నంగా చూపిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :