పెళ్ళిచూపులు దర్శకుడి రెండో సినిమా విడుదల అప్పుడే !

8th, February 2018 - 11:15:51 AM

గత ఏడాది ‘పెళ్ళి చూపులు’ సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తన రెండో సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో చేస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త వారితో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకురాబోతోంది.

ఈ సినిమా షూటింగ్ తక్కువ కాలంలో పూర్తవ్వడం విశేషం. రోడ్ జర్నీ నేపద్యంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ‘పెళ్లి చూపులు’ సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకు పని చేస్తున్నాడు. త్వరలో ఈ చిత్ర యూనిట్ మీడియాతో సమావేశమై మరిన్ని విషయాలు తెలుపబోతున్నారు.