నారా హీరో పక్కన ఆ హీరోయిన్ నటిస్తోందా ?

నారా రోహిత్ తన 18వ ప్రాజెక్ట్ ‘శబ్దం’ సినిమాను ఉగాది రోజున మొదలు పెట్టాడు. మంజునాద్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో నారా రోహిత్ సినిమా మొత్తం ముగవాడిగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో నివేద థామస్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. నివేద అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించడం జరిగిందట.

త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీవైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వికాస్ కురిమెళ్ల సంగీత దర్శకుడు. రిచర్డ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫి అందిస్తోన్న ఈ మూవీని డా॥సౌజన్య అట్లూరి సమర్పిస్తున్నారు. విభిన్నమైన కథ కథనాలతో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.