ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు ఇవే!

రవితేజ టచ్ చేసి చూడు సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రీతమ్ అందించిన సంగీతం పాపులర్ అయ్యింది. ట్రైలర్ లో రవితేజ ఎనర్జీ చూపించాడు. సినిమా బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. డైరెక్టర్ విక్రమ్ సిరికొండ ఈ సినిమా పై నమ్మకంగా ఉన్నాడు. వక్కంతం వంశి అందించిన కథలో బలం ఉందని సమాచారం.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ నటించారు. రాశిఖన్నా ఒకరు, సీరత్ కపూర్ మరొకరు. ఇద్దరికి సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలే లభించాయి. రాశిఖన్నా డాన్సర్ గా ఈ సినిమాలో కనిపిస్తుండగా సీరత్ కపూర్ రవితేజ ఫ్యామిలి ఫ్రెండ్ గా నటించింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆడియన్స్ స్టన్ అయ్యే విధంగా ఉండబోతుందని సమాచారం. మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుందాం.