“కేజీయఫ్ 2” హిందీ వెర్షన్ పై అది ఫేక్ న్యూస్ అట.!

Published on Apr 28, 2021 9:00 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సీక్వెన్స్ “కేజీయఫ్ చాప్టర్ 2”. దీనితో ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసిన ఈ చిత్రంపై ఉన్న ప్రతిష్టాత్మక అంచనాల నిమిత్తం మేకర్స్ కూడా అవుట్ పుట్ ను మరింత సహజంగా ఉంచేందుకే ప్రయత్నం చేస్తున్నారు.

అలా ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం స్వయంగా గా యష్ నే డబ్బింగ్ చెబుతున్నాడని ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే మళ్ళీ లేటెస్ట్ గా ఆ వార్త నిజం కాదు అని బాలీవుడ్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సంకేత్ మహీత్రూ డబ్బింగ్ చెప్పనున్నాడని టాక్ వచ్చింది. మరి దీనితో సంకేత్ ఈ వార్త పూర్తిగా అబద్దం అని ఇందులో ఎలాంటి నిజమూ లేదని తన ఇన్స్టా ద్వారా ఖండించాడు. దీనితో యష్ రోల్ కు తానే డబ్ చెప్పుకోవడం కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :