“ది బేకర్ అండ్ ది బ్యూటీ” సీరీస్ సెప్టెంబర్ 10 నుండి ఆహా వీడియో లో!

Published on Aug 26, 2021 11:00 pm IST

సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్ ప్రధాన పాత్రల్లో ఆహా వీడియో తీసుకొస్తున్న సరికొత్త టెలివిజన్ సీరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీ. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను తాజాగా అల్లు అరవింద్ మరియు సుప్రియ యార్లగడ్డ లు విడుదల చేయడం జరిగింది. సంతోష్ శోభన్ మరియు టీనా లు కలిసి ఉన్న ఈ పోస్టర్ ఆసక్తి గా ఉంది. ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన విడుదల తేదీను సైతం ఆహా వీడియో ప్రకటించడం జరిగింది. సెప్టెంబరు 10 వ తేదీ నుండి ఈ వెబ్ సిరీస్ ఆహా వీడియో లో ప్రసారం కానుంది.

అయితే ఒక లోకల్ గాయ్ లైఫ్ లోకి ఒక అతిలోక సుందరి వస్తే, లైఫ్ సెలబ్రేషన్ అవుతుందా లేక రోలర్ కాస్టర్ రైడ్ అవుతుందా అంటూ ఆహా వీడియో చేసిన వ్యాఖ్యలు ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది. లవ్ స్టోరీ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :