‘లవ్ స్టోరీ’ కోసం ఆ రెండు సంస్థల మధ్యే గట్టి పోటీ ?

Published on Sep 21, 2020 5:06 pm IST

టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది శేఖర్ కమ్ములకు. ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్ ‘ చైతు – సాయిపల్లవి’లతో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయట డిజిటల్ ప్లాట్ ఫామ్స్. చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధరను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మొన్నటి వరకూ పోటీలో జీ5 ముందు ఉండగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కూడా పోటీలో ముందుకు వచ్చింది. ఈ సంస్థలలో ఏదోక ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ సినిమాని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.

ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. పైగా సినిమా కాంబినేషన్ తో పాటు శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా లవ్ స్టోరికి బాగా కలిసి వచ్చాయి. దానికి తోడు క్రేజీ బ్యూటీ సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం కావడం, వీరి జోడీ పై ప్రేక్షకుల్లో బీభత్సమైన ఇంట్రస్ట్ ఉండటం సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

సంబంధిత సమాచారం :

More