ఆస్కార్ నామినేటెడ్ మూవీ ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ తెలుగులో విడుదల ఈ నెల 21న!

ఆస్కార్ నామినేటెడ్ మూవీ ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ తెలుగులో విడుదల ఈ నెల 21న!

Published on Nov 12, 2025 8:01 AM IST

face

వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ (The Face of the Faceless) చిత్రం ఈ నెల నవంబర్ 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిస్వార్థ సామాజిక కార్యకర్త, కాథలిక్ మత సోదరి సీనియర్ రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. పేదల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషి, ఎదుర్కొన్న కష్టాలను ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమాలో విన్సీ అలోషియస్ ప్రధాన పాత్ర పోషించారు.

ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాను దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు, మత పెద్దలు ఈ సినిమా గొప్పదనాన్ని వివరించారు. ఈ చిత్రం 123 అవార్డులు పొందిందని, ఇది క్షమాపణ, శాంతి, ప్రేమ విలువను తెలుపుతుందని వక్తలు అన్నారు.

ఒకప్పటి హీరో రాజా మాట్లాడుతూ, రాణి మరియా త్యాగం గురించి ఈ సినిమా ఉంటుందని, ప్రతి ఒక్కరూ దీన్ని ఆదరించాలని కోరారు. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ, గొంతుక లేని వారికి గొంతుక అందించే సినిమా ఇదని, తెలుగు రాష్ట్రాల్లో 50-60 థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. ప్రపంచాన్ని కదిలించిన ఈ మానవత్వంతో కూడిన సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించి, తెలుగులో కూడా హిట్ చేయాలని చిత్ర బృందం కోరింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు