నాగ్ “ది ఘోస్ట్” నుండి ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్ రెడీ!

Published on Jul 6, 2022 7:30 pm IST

అక్కినేని నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ది ఘోస్ట్. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం లో లేడీ లీడ్ రోల్ లో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ నటిస్తుంది. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ పై చిత్ర యూనిట్ ఇక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్ ను రేపు ఉదయం 11 గంటలకు రివీల్ చేయనున్నారు మేకర్స్. తాజాగా వచ్చిన ప్రకటన తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లేదా, టీజర్ కి సంబందించిన అప్డేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :