మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేసిన “ది కాశ్మీర్ ఫైల్స్”!

Published on Apr 11, 2022 2:00 pm IST

చిన్న సినిమా గా విడుదల అయిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాశ్మీర్ పండిట్ ల ఆధారం గా తెరకెక్కిన ఈ చిత్రం కి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఆదివారం 1.15 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ ఈ చిత్రం 250 కోట్ల రూపాయల కు పైగా వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.

మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేసిన ఈ చిత్రం పై సర్వత్రా ప్రశంశల వర్షం కురుస్తోంది. జీ స్టూడియోస్ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ల పై సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయ్ మండ్లేఖర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సర్ లు నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :