ఎలెక్షన్స్ రిజల్ట్ ను బట్టే షూటింగ్ ప్లాన్ !

Published on Mar 24, 2019 1:00 am IST

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణతో చేయబోయే సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఇటీవలే తెలుగు దేశం పార్టీ కోసం పలు యాడ్ ఫిల్మ్స్ ను రూపొందించిన బోయపాటి.. బాలయ్య స్క్రిప్ట్ కు కొంత గ్యాప్ ఇచ్చారు. అయితే ఇక ప్రస్తుతం బోయపాటి స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారట. ఏపీలో జరగబోయే ఎలక్షన్స్ పూర్తి అయ్యాక ఈ సినిమా షూటింగ్ ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి.

కాగా ఎలెక్షన్స్ రిజల్ట్ ను బట్టి షూటింగ్ ను ప్లాన్ చేద్దామని బాలయ్య అన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా ‘జూన్’ నుండి రెగ్యూలర్ షూటింగ్ ను మొదలుపెట్టొచ్చు. ఇక గతంలో బాలయ్యకి ‘సింహ, లెజెండ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన బోయపాటి, ఈ సారి అలాంటి సూపర్ హిట్ ని ఇచ్చి.. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తాడేమో చూడాలి. ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More