నయన్ – విగ్నేష్ పెళ్ళికి హాజరైన బిగ్ స్టార్స్ వీరే.!

Published on Jun 9, 2022 2:01 pm IST

సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ లు పెళ్లి వేడుక ఈరోజు ఘనంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న వీరి ప్రేమ ప్రయాణం ఎట్టకేలకు పెళ్లి పీటలు దగ్గరకి వచ్చేసరికి దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే నిర్వహించే ప్లాన్ చేసుకున్నారని చెప్పాలి. మరి ఈ వేడుకలకి గాను టోటల్ ఇండియన్ వైడ్ అనేకమంది బిగ్ స్టార్స్ హాజరు అవుతున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది.

అయితే ఈ వేడుకల్లో ఆల్రెడీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హాజరు కాగా తనతో పాటు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్ కుమార్, అలాగే సూర్య, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, స్టార్ దర్శకుడు అట్లీ తదితరులు హాజరు కాబోతున్నారట. మొత్తానికి అయితే వీరి పెళ్లి వేడుక పెద్ద మల్టీ స్టారింగ్ రీ యూనియన్ లా మారింది అని చెప్పాలి

సంబంధిత సమాచారం :