“హిట్ 3” లో ఈ ఇద్దరి బిగ్ స్టార్స్.!

“హిట్ 3” లో ఈ ఇద్దరి బిగ్ స్టార్స్.!

Published on Nov 23, 2022 1:04 AM IST


ఇప్పుడు మన టాలీవుడ్ సినిమా నుంచి ఎలాంటి చిత్రాలు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాము. మరి ఇప్పుడు తమ టాలెంట్ తో సత్తా చాటుతున్న యంగ్ దర్శకుల్లో “హిట్” సినిమా ఫేమ్ శైలేష్ కొలను కూడా ఒకరు. మరి శైలేష్ ఈ చిత్రం చాలా పెద్ద ఫ్రాంచైజ్ గానే ప్లాన్ చెయ్యగా ఇప్పుడు ప్రామిసింగ్ హీరో అడివి శేష్ తో “హిట్ 2” చేసి రిలీజ్ కి రెడీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత కూడా ఆల్రెడీ హిట్ 3 కి రంగం సిద్ధం చేయగా దీనిపై క్రేజీ బజ్ అయితే ఇప్పుడు బయటకి వచ్చింది.

ఈసారి మూడో చిత్రంలో నాచురల్ స్టార్ నాని అలాగే తమిళ్ నుంచి అయితే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ కనిపించనున్నారట. దీనితో అయితే ఈ ఫ్రాంచైజ్ నెమ్మదిగా భారీతనం తెచ్చుకుంటుంది అని చెప్పాలి. అయితే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. మరి ఇద్దరు విలక్షణ నటులు స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే మూవీ లవర్స్ కి ఈ చిత్రం మంచి ట్రీట్ గా నిలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు