ఆ పాపులర్ టాక్ షో కి హాజరు కానున్న స్టార్ హీరోలు?

Published on Mar 31, 2023 3:00 am IST

బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ తన సూపర్‌హిట్ సెలబ్రిటీ టాక్ షో, కాఫీ విత్ కరణ్ యొక్క 8వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజా అప్డేట్‌ ప్రకారం, కాఫీ విత్ కరణ్ సీజన్ 8 ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ప్రసారం కానుంది. కరణ్ తన షోకి టాప్ బాలీవుడ్ స్టార్స్ ను ఎక్కువగా ఆహ్వానిస్తాడు. అయితే ఈసారి ముగ్గురు సౌత్ స్టార్స్ అల్లు అర్జున్, యష్ మరియు రిషబ్ శెట్టి ఈ షోకి హాజరవుతారని ప్రచారం జరుగుతోంది.

అల్లు అర్జున్, యష్ మరియు రిషబ్ శెట్టి వరుసగా పుష్ప ది రైజ్, KGF, కాంతార భారీ విజయాలతో పాన్ ఇండియన్ పాపులారిటీని పొందారు. వారి పెర్ఫార్మెన్స్ కారణం గా వారికి మరింత క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ రాబోయే సీజన్ మొదటి ఎపిసోడ్‌కు మొదటి సెలబ్రిటీ గెస్ట్ అని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది.

సంబంధిత సమాచారం :