ప్లాప్ అనుకుంటే బాక్సాఫీస్ వద్ద పటాసుల్లా పేలాయి

Published on Nov 13, 2019 8:53 pm IST

ఈ ఏడాది బాలీవుడ్ లో మూడు సినిమాలు క్రిటిక్స్ కి షాక్ ఇచ్చాయి. వాళ్ళ జడ్జిమెంట్ ని సవాల్ చేస్తూ సూపర్ హిట్ గా నిలిచాయి. వాటిలో ఒకటి షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్, ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మరియు అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ
హౌస్ ఫుల్ 4. ఈ మూడు చిత్రాల విషయంలో ఆడియన్స్ అభిరుచికి క్రిటిక్స్ రేటింగ్స్ కి సంబంధం లేకుండా పోయింది.

టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన కబీర్ సింగ్ జూన్ 21విడుదలైంది. ఈ మూవీకి బాలీవుడ్ క్రిటిక్స్ దారుణమైన రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫెమినిస్టులు అనేక ఆరోపణలు చేశారు. వాటికి విరుద్ధంగా హిందీ జనాలకు కబీర్ సింగ్ తెగ నచ్చేసింది. దాదాపు 370కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో షాహిద్ కెరీర్ బెస్ట్ మూవీ గా మరియు 2019 సెకండ్ హైయెస్ట్ గ్రాస్సింగ్ చిత్రంగా నిలిచింది.

ఇక ప్రభాస్ నటించిన సాహోమూవీకి బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ మరియు ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ మరియు కొందరు క్రిటిక్స్ ఘోరంగా 1.5 రేటింగ్ ఇవ్వడమే కాకుండా జంక్ మూవీ అని చెప్పడం జరిగింది. కానీ ఈ చిత్రం బాలీవుడ్ లో తెలుగు వర్షన్ కు మించి వసూళ్లు సాధించింది. సాహో హిందీ వర్షన్ 150కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ హౌస్ ఫుల్ 4 చిత్రం కూడా నెగెటివ్ రివ్యూస్ తో మొదలై ఆశ్చర్య కరంగా ఇప్పటికే 200కోట్ల వసూళ్లను దాటి వేసింది. ఇలా ఈ మూడు చిత్రాలు క్రిటిక్ రివ్యూస్ కి భిన్నమైన ఫలితాలను చవిచూశాయి.

సంబంధిత సమాచారం :