సెన్సార్ పూర్తి చేసుకున్న ‘తిమ్మరుసు’ !

Published on Jul 24, 2021 3:50 pm IST

విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో నటుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ సినిమా ట్యాగ్‌లైన్‌. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A’ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది.

‘118’ వంటి సూపర్‌హిట్‌ థ్రిల్లర్‌తో పాటు కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్‌ ఇండియా’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’, ‘సూర్యకాంతం’ వంటి డిఫరెంట్ చిత్రాలను అందించిన నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ‘బ్లఫ్‌ మాస్టర్‌’తో హీరోగా మెప్పించిన సత్యదేవ్‌ ఆ తరువాత ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలోనూ వైవిధ్యమైన టైటిల్‌ పాత్రను పోషించి ప్రేక్షకులను అలరించారు. నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు.

సంబంధిత సమాచారం :