2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న తిమ్మరుసు పాట!

Published on Jul 18, 2021 9:55 pm IST

శరణ్ కొప్పిషెట్టి దర్శకత్వం లో సత్యదేవ్ హీరోగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం తిమ్మరుసు. ఈ చిత్రం విడుదల కు సిద్దం అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రం నుండి తిమ్మరుసు పాటను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పాట ను విడుదల చేసిన రెండు రోజుల్లో రెండు మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఎంజీ శ్రీనివాస్ కథ అందించిన ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.అయితే ఈ చిత్రం జూలై 30 వ తేదీన థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కూడా దూసుకు పోతుంది.

సంబంధిత సమాచారం :