సమంత, నందిని రెడ్డి.. ముచ్చటగా మూడోసారి ?

Published on Jul 11, 2019 3:01 am IST

సమంత, నందిని రెడ్డిల కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘ఆహా కళ్యాణం’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత చాన్నాళ్లకు వీరిద్దరూ కలిసి ‘ఓ బేబీ’ సినిమా చేశారు. ఈసారి ఫలితం ఆశించిన విధంగానే వచ్చింది. మొదటిరోజే సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో ఇద్దరి ఖాతాలో మంచి విజయం నమోదైంది. ఈ ఉత్సాహంతోనే వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తారని తెలుస్తోంది.

‘ఓ బేబీ’ చిత్రీకరణ సమయంలోనే నదిని రెడ్డి సమంతకు ఒక కథ వినిపించారట. అది నచ్చిన సమంత తప్పకుండా చేద్దాం అని మాటిచ్చారట. ఇప్పుడు ‘ఓ బేబీ’ హిట్టైంది కాబట్టి వీరి కాంబో పై ప్రేక్షకుల్లో అంచనాలతో పాటు మార్కెట్లో డిమాండ్ కూడా ఉంది. ఈ వేడి తగ్గకముందే వీరు సినిమా చేయాలని భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తలు నిజమై త్వరలోనే వీరు కొత్త సినిమాను ప్రకటిస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More